టెక్నాలజీ: ఈమెయిల్ వాడుతున్న వారు ఈ రూల్స్ మరచిపోకండే..!!
కంప్యూటర్‌తో టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈమెయిల్ గురించి తెలుస్తుంది. దీని వాడకం గురించి అవగాహన ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే చాలామంది ఈమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాతే కంప్యూటర్ రంగంలో పూర్తి స్థాయిలో ఎంటర్ అవుతారు. ఈమెయిల్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ సమూలంగా మారిపోయింది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారడంలో ఈమెయిల్ చాలా కీలక పాత్ర పోషించింది. ఇక ఏళ్లు గడుస్తున్నా రోజు రోజుకు తన ప్రాముఖ్యతను పెంచుకుంటున్న శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఈమెయిల్ కూడా ఒకటి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయితే ఈమెయిల్ సర్వీసులను ఉపయోగించుకుంటున్న ప్రతిఒక్క యూజర్ తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. మరి ఆ రూల్స్ ఏంటో ఓ లుక్కేస్తే పోలా. వాస్తవానికి ప్రొఫెషనల్ మెయిల్స్‌కు మంచి ఇంట్రడక్షన్ అవసరం. కాబట్టి, మీరు పంపే ప్రొఫెషనల్ మెయిల్స్‌కు మంచి ఇంట్రడక్షన్ ఇవ్వండి. అంటే విషయాన్ని హైలెట్ చేస్తూ ఇంట్రడక్షన్ ఉండాలి. అలాగే మీరు ఈమెయిల్‌లో ఏమి చెప్పాలనుకుంటున్నారో..? ఆ వివరాలను హైలైట్ చేస్తూ క్లియర్‌గా సబ్జెక్ట్ లైన్‌లో రాయండి.
మీరు మెయిల్ పంపబోయే వ్యక్తి హోదాకు అనుగుణంగా వారి పేర్లకు ముందు మిస్టర్.. మిస్.. సార్ ఇలాంటి పదాలను వాడండి. వారిని అడ్రస్ చేసేముందు డియర్, హాట్ వంటి పదాలను వాడితే మరింత గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. అప్పుడు అవతల వాళ్లు కూడా బాగా ఎట్రాక్ట్ అవుతారు. ఇక ఈమెయిల్ ద్వారా అవతల వ్యక్తికి మీరు చెప్పాలనుకుంటున్న విషయం క్లారిటీగా స్పష్టతను కలిగి ఉండాలి. అందుకు ఈమెయిల్ రైటింగ్ లో ఎస్ఎంఎస్ షార్ట్‌కట్‌లు వాడకండి.