భూమితో పని లేకుండా.. మట్టి అంటకుండా పంటలు పండిస్తున్నారు..!

ఏదైనా పంట పండించాలంటే ముందు కావాల్సింది ఏంటి.. భూమి ఆ తర్వాత నీరు.. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో భూమి లేకపోయినా పంటలు పండిండిచొచ్చు. ఆధునిక వ్యవసాయంగా ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది. దీన్నే ఎయిరో పోనిక్ ఫామింగ్ అంటున్నారు. 

 

ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఈ విధానం ద్వారా బంగాళాదుంపలు వంటి పంటలు పండిస్తున్నారు. మరి భూమి లేకుండా వ్యవసాయం ఎలాగా అంటున్నారా.. సింపుల్.. బంగాళదుంపల మొక్కలను మట్టి అవసరం లేకుండా ప్లాస్టిక్  లేదా థర్మాకోల్  డబ్బాలో ఉంచుతారు. దాన్ని  గాల్లో వేలాడదీస్తారు. అవసరం మేరకు నీరు, గాలి, పోషకాలను అందిస్తారు. దీని ద్వారా వేర్లు పెరుగుతాయి. వేర్లు పెరిగే కొద్ది చిన్న పరిణామంలో బంగాళదుంపలు పెరుగుతుంటాయి. 

 

హర్యానాలో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. అంతేకాదు ఈ విధానంతో దిగుబడి కూడా చాలా ఎక్కువగా వస్తుందట. సాధారణంగా పండించే వాటి కన్నా 10 నుంచి 12 రెట్లు అధికంగా పంట వస్తుందట. వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రకం విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: