డ్రైవర్ లు లేని కార్ లు మనం భవిష్యత్తు లో మాత్రమె చూడగలం అనుకుంటే పొరపాటు. డ్రైవర్ లెస్ కార్లు త్వరలో మనం ఎక్కబోతున్నాం అనేందుకు ఇదే ఒక ముఖ్య సూచిక. సింగపూర్ కి చెందిన నుటోనామీ అనే కంపెనీ ఒక అడుగు ముందరకి వేసి డ్రైవర్ లేని కార్లని ప్రయోగాత్మక దశలోంచి వాడుకునే దశ కి తీసుకుని ఒచ్చేసింది. ఈ కారుని ఫ్రీరైడ్ కోసం ఎవరైనా స్మార్ట్ ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నుటోనోమీ కంపెనీ అనేక ప్యాకేజీ లతో కూడిన ఈ సర్వీస్ లు అందిస్తోంది. జనం సాధారణంగా డ్రైవర్ లేని కారు ఎక్కడానికి ఇష్టపడరు , భయపడతారు అనే ఉద్దేశ్యం తో ఫ్రీ రైడ్ లని అందిస్తోంది ఈ కంపెనీ. ఆరున్నర కిలోమీటర్ల ప్రాంతం లో మాత్రమే ఇవి తిరుగుతూ ఉన్నాయి. ఇవాళ తో టెస్ట్ డ్రైవ్ పూర్తయ్యింది అని అంటోంది కంపెనీ