టీవీ: కార్తీకదీపం ఫేమ్ వంటలక్క భర్త గురించి ఈ విషయాలు తెలుసా..?

Divya
తెలుగు బుల్లితెరపై దాదాపుగా ఏడేళ్ల వరకు అగ్రస్థానంలో ఉన్నటువంటి సీరియల్స్ కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. మొదటి రోజు నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఈ సీరియల్ కు మంచి క్రేజ్ లభించింది. కార్తీకదీపం సీరియల్ పేరు చెప్పగానే అందరికీ డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత పేర్లు బాగా గుర్తుకు వస్తాయి. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్కగా నటించిన ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాధ్.. ఈమె కేరళ ప్రాంతానికి చెందిన నటి అయినప్పటికీ కూడా కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంది.

ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఫోటోలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె కొడుకు జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అలాగే ప్రేమి విశ్వనాథ్ భర్త గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు కానీ ఇండస్ట్రీలో అతడు కూడా మంచి పాపులారిటీ అందుకున్నారట. దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రేమి విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్య నిపుణులట.

2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా కూడా గుర్తింపు పొందినట్లు సమాచారం అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ గా కూడా ఈయన ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం నటిగా తాను మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ తన భర్త వినిత్ గురించి ప్రేమి విశ్వనాథ్  చాలాసార్లు తెలియజేసింది. తన భర్త సహకారం లేకపోతే ఈరోజు తన కెరియర్ ఇలా ముందుకు సాగేది కాదు అంటూ కూడా వెల్లడించింది తెలుగులో కంటే మలయాళం లో ప్రేమి విశ్వనాథ్ ఎన్నో సీరియల్స్ లో నటించిన తెలుగులో కస్టడీ అనే చిత్రంలో కూడా కీలకమైన పాత్రలు నటించింది. కానీ బుల్లితెర పైన పాపులారిటీ సంపాదించుకున్న ఈమె వెండితెర పైన గెలవలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: