టీవీ: రోడ్డుపై టిఫన్ బండి నడుపుతున్న బుల్లితెర నటి.. ఎవరంటే..?
తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను తెలిపింది.. ముఖ్యంగా తాను చిన్న వయసులో ఉన్నప్పుడే తన ఇంటి ఎరుపక్కల రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర థియేటర్లు ఉండేవి అని ఇప్పటికీ కూడా ఈ థియేటర్లు రన్నింగ్ లోనే ఉన్నాయి థియేటర్ నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడల్లా తను కూడా సినిమాలలో నటించాలని కోరిక ఉండేదని తనని తాను తెరమీద చూసుకోవాలని ఆశ కలుగుతూ ఉండేదని తెలిపారు. అలా డబ్ స్మాస్ ,టిక్ టాక్ వంటి యాప్ ల ద్వారా యాక్టింగ్ ని ప్రాక్టీస్ చేశానని తెలిపింది.
అందులో తన నటన బాగుంది అని తెలుసుకోగలిగానని ఆ వీడియోలు చూసిన తన కుటుంబ సభ్యులు స్నేహితులు సైతం తనని బాగా ఎంకరేజ్ చేసే వారిని తెలియజేసింది. వివాహమై ఒక కొడుకు పుట్టిన తర్వాత కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల చాలామంది టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని తెలిపారు. అలా ఆరోజు నుండి ఈరోజు వరకు తాను చాలా సీరియల్స్ లో నటించానని తెలిపింది.. గృహప్రవేశం, నిన్నే పెళ్ళాడుతా, గుప్పెడంత మనసు, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు సీరియస్ లో నటించిన. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రేమ విమానం, లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేజర్ లో కూడా నటిస్తోందట.