టీవీ: ఆ తప్పులే చిన్నారి పెళ్ళికూతురు ని ఎదగనీయకుండా చేశాయా..?

Divya
నటి ఆవికా గోర్.. చిన్నారి కూతురు అనే సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో వెండితెర పైన కూడా నటించే అవకాశాన్ని అందుకుంది ఆవికాగోర్.. తెలుగులో ఉయ్యాల జంపాల అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వగా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి తదితర చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఆ తర్వాత సరైన కథలు ఎంపిక విషయంలో నిర్ణయాలు తీసుకోలేక పలు సినిమాలలో నటించిన డిజాస్టర్లుగా మిగిలాయి. ఇలా సరైన నిర్ణయాలు తీసుకోలేక స్టార్ స్టేటస్ అందుకోలేక పోయిందని అభిమానులు వాపోతూ ఉంటారు.

మళ్లీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత పాప్ కార్న్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన ఫెయిల్యూర్ హీరోయిన్ గానీ మిగిలిపోయింది ఆవికా గోర్.. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో కెరియర్ పరంగా వ్యక్తిగతంగా కూడా కొన్నేళ్లపాటు తాను బయటికి కూడా రాలేదని ఎన్నో సమస్యలు తనను చుట్టుముట్టాయని వెల్లడించింది.. తాను ఎక్కువగా నటన గురించే ఆలోచించేదాన్ని శరీరం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు.. అందుకే చాలా లావుగా అయ్యానని.. దీంతో తనకి అవకాశాలు ఎవరూ ఇవ్వకపోవడంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

అలా బరువు తగ్గిన అడపా దడపా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని దీంతో తానే సొంతగా ఆవికా స్క్రీన్ క్రియేషన్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాను.. రెండు చిత్రాలను అయితే తీశాము కానీ అవి కూడా ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.. దీంతో డబ్బులు కూడా నష్టపోయానని వెల్లడించింది. కానీ చాలెంజింగా తీసుకొని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ చిత్రాలను తెరకెక్కించాలని తెలిపింది. చివరిగా ఓటీటిలో వధువు అనే వెబ్ సిరీస్ తో క్రేజ్ బాగానే అందుకుంది. అయితే ఈ అమ్మడు వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తూ ఉండడమే మంచిదని నిర్మాతగా మారి కెరియర్ నాశనం చేసుకుంటుందని అభిమానులు తెలుపుతున్నారు. మరి అభిమానులు మాత్రం సినిమాలలో నటించమని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: