టీవీ: చమ్మక్ చంద్ర గురించి విస్తు పోయే నిజాలు చెప్పిన సత్తిపండు..!!

Divya
జబర్దస్త్ కామెడీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు.. జబర్దస్త్ లో ఎన్నో లేడీస్ స్కిట్లు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు.చమ్మక్ చంద్ర ఎలాంటి గెటప్ వేసిన కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.. అలా గతంలో చమ్మక్ చంద్ర టీమ్ లో సత్తిపండు కూడా బాగా పాపులారిటీ అయ్యారు... అలా కొద్ది రోజులకే టీమ్ లీడర్ గా కూడా మారారు సత్తిపండు.

అయితే ఒక ఇంటర్వ్యూలో సత్తిపండు మాట్లాడుతూ స్కిట్లలో ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ ఉండే చమ్మక్ చంద్ర రియల్ లైఫ్ లో మాత్రం ఒక మంచి వ్యక్తి అంటూ తెలియజేశారు.. చమ్మక్ చంద్ర బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి 18 ఏళ్ల పాటు కసితో ట్రై చేసి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. ముఖ్యంగా ఆయన ఎవరిని నొప్పించారు ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ గానే ఉంటుంది.. ఏది చేసినా కూడా చాలా ఆలోచించే చేస్తారు అంటూ తెలిపారు.. అలాగే తోటి వారికి సహాయం చేయాలని మనస్తత్వం కలిగిన వ్యక్తి అని కూడా తెలిపారు సత్తిపండు.

అంతేకాకుండా చమ్మక్ చంద్ర అవయవ దానం చేశారని ఆ కార్డును తనకి మాత్రమే చూపించారనీ..మానవత్వం లేకపోతే ఇలాంటివి ఎవరూ చేయరు కదా ఆర్టిస్టుగా ఆయనలో ఉన్న అన్ని కోణాలు తనకు బాగా తెలుసు అని కానీ రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అని కూడా వెల్లడించారు సత్తిపండు.. జబర్దస్త్ లో ఉన్నన్ని రోజులు కొత్త వాళ్లను బాగా ప్రోత్సహించేవారు వేషం లేకపోతే లేదని వెంటనే చెప్పేస్తారు తప్ప వారిని బాధ పెట్టేలా మాట్లాడాలని తెలియజేశారు.. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో సత్తిపండు కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు.. చంద్ర వెళ్ళిపోయిన తర్వాత చాలామంది కూడా జబర్దస్త్ వీడి బయటికి వచ్చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: