టీవీ: హాస్పిటల్లో చేరిన ఫైమా.. ఆందోళనల ఫ్యాన్స్..!!

Divya
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న లేడీ కమెడియన్సులో జబర్దస్త్ పైమా కూడా ఒకరు.. మొదట పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి మరింత క్రేజ్ అందుకుంది. అతి కొద్ది సమయంలోనే తన కామెడీ పంచలతో ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది.. ఫైమా లేనిది స్కిట్ చూడలేము అనే అంతలా ఈమె పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఫైమా బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత జబర్దస్త్ షో కి కొంతకాలం గ్యాప్ ఇచ్చింది పైమా.


అయితే జబర్దస్త్ లో ఉన్నప్పుడే కమెడియన్ ప్రవీణ్ తో కలిసి ఈమె ప్రేమాయణం మొదలుపెట్టింది. అతనిని వివాహం చేసుకుంటానని కూడా తెలియజేసింది. అయితే బిగ్బాస్ నుంచి బయటికి వచ్చాక వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని అంతకుముందున్న ఫైమా కాదని కూడా ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.. ఫైమా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఒకపక్క షోలో మరొకపక్క జబర్దస్త్ చేస్తూ మంచి బిజీగా ఉన్న సమయంలో సడన్గా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది

సోషల్ మీడియాలో ఆమె హాస్పిటల్ బెడ్ పైన ఒక సెలైన్ బాటిల్ పెట్టుకొని ఉన్నటువంటి ఒక వీడియోని సైతం షేర్ చేయడం జరిగింది.. దీంతో పైమా నా గతమంతా  మరిచానే అంటూ రాసుకురావడం జరిగింది. అయితే ఈమె హాస్పిటల్లో ఎందుకు చేరింది అనే విషయం మాత్రం తెలియజేయలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం పైన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. అయితే పైమా ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉందంటే తెలుస్తోంది. దీంతో అభిమానుల సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫైమా త్వరగా కోలుకోవాలని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: