టీవీ: రాత్రిళ్ళు అక్కడికి వెళ్లకపోతే అవకాశాలు రావు అనసూయ షాకింగ్ కామెంట్స్..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు వెండితెర పైన విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించిన అనసూయ మొదట కామెడీ షో అయిన జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. అలా వచ్చిన పాపులారిటీతోనే రంగస్థలం సినిమాలో ఒక విభిన్నమైన క్యారెక్టర్లలో నటించి అనసూయ తన స్టామినాను నిరూపించుకుంది. ఆ తర్వాత క్షణం, పుష్ప తదితర సినిమాలలో నటించి ఒక్కసారిగా తన రేంజ్ మారిపోయేలా చేసింది అనసూయ. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తనమీద ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది.
ఎవరేమన్నా కూడా పట్టించుకోని అనసూయ ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హాజరైన అనసూయ తను హీరోయిన్గా ఎందుకు అవకాశాలు రాలేకపోయాయి అనే విషయం పైన తెలియజేయడం జరిగింది. తనకి గతంలో అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో నటించడానికి అవకాశం వచ్చిందని.. అయితే ఆ పాటలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారని తెలిసి వెంటనే నో చెప్పానని ఎందుకంటే గుంపులో తనకి నటించడం అసలు నచ్చదని తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటేనే నచ్చడానికి ఇష్టపడతానని చెప్పింది అనసూయ. అందుకే ఆ పాటకి నో అని చెప్పానని తెలిపింది.

అయితే అలా నో చెప్పిన తర్వాత చాలామంది తనను విమర్శించారని.. దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ జరగడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి సారీ చెప్పానని కూడా తెలిపింది.. హీరోయిన్గా అవకాశాలు రాకపోవడం పై స్పందించిన అనసూయ షూటింగ్లో తన పని అయిపోగానే వెళ్ళిపోతానని కానీ సినిమా అయ్యాక కూడా చాలామంది పార్టీలకు వెళితేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయని అలా వెళ్లకుండా దూరంగా ఉండడం వల్లే తనకు హీరోయిన్గా అవకాశాలు కోల్పోయానని తెలిపింది అనసూయ.. అయితే ఇలాంటి వాటిని తను అసలు ప్రోత్సహించనని తెలిపింది. గతంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించాలనుకున్నాను కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయనని ఎలాంటి పాత్రలోనైనా సరే మన నటనను బట్టి గుర్తింపు వస్తుందని నమ్మకం కలిగిందని తెలిపింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: