టీవీ: బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరో తెలిసిపోయిందిగా..?
ఇకపోతే కిరణ్ రాథోడ్ కి వారానికి రూ.2.75 లక్షల రెమ్యునరేషన్ బిగ్ బాస్ ఇస్తుండడంతో ఇక ఆమెను ఎలిమినేట్ చేయడమే బెటర్ అని ఆలోచించినట్లు ఉన్నారు. అందుకే ఆమెను ఎలిమినేట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయం ఇప్పుడే వైరల్ అవుతూ ఉండడం గమనార్హం . ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ విన్నర్ రతిక రోజ్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ రతికకు ఫేవర్ గా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా రతిక ఏమి చేయకపోయినా సరే ఆమెకే బిగ్ బాస్ సపోర్ట్ ఇస్తున్నాడు అంటూ షకీలా వంటి వారు మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇక ఇంప్రెస్ ద బిగ్ బాస్ టాస్క్ లో రతిక ఏం చేయకపోయినా విన్నర్ కావడంతో ఈ కామెంట్లు ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏమి సీఎంచేయకపోయినా టాస్క్ లో విన్నర్ అయ్యారు అంటే బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్ విషయంలో ఒక్క విధంగా వ్యవహరిస్తున్నాడని నేటిజెన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఇంకెన్ని వార్తలు వస్తాయో చూడాలి.