టీవీ: బిగ్ బాస్ 7 నుంచి బిగ్ అప్డేట్.. ఇది ఊహించి ఉండరు..!

Divya
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే సీజన్ సెవెన్ ను ఎలాగైనా సరే సక్సెస్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఈసారి హౌస్ లో రెండు హౌస్ లు ఉంటాయని సమాచారం. ఇకపోతే సీజన్ సెవెన్ పట్ల మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుండి టాస్క్, గేమ్స్ తో పాటు ఏకంగా షో ఫార్మాట్ ను కూడా మార్చేసారని సమాచారం.

మొత్తం ఇందులో 20 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతుండగా..  2 వేర్వేరు హౌసులు కూడా ఉంటాయట. అంటే ఒకే షోలో రెండు ఇల్లు అన్నమాట. ముఖ్యంగా ఇందులో కంటెస్టెంట్లను విభజించి రెండు ఇళ్లలోకి పంపుతారట. ఇక కంటెస్టెంట్స్ యొక్క  గేమ్స్, టాస్క్, పరిస్థితులు , ప్రవర్తన ఆధారంగా ఇల్లు మారుతూ ఉంటారు చాలా కొత్తగా బాగుందనిపిస్తోంది అంటూ ఇది చూసిన నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.  ముఖ్యంగా ప్రేక్షకులకు ఈ షో కనెక్ట్ అయితే మాత్రం భారీగా ఆదరణ దక్కడం ఖాయం. ఇక సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో హీరోయిన్ ఫర్జానా, అబ్బాస్ , షకీలా వంటి స్టార్ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.

మరొకవైపు బుల్లితెర నుంచి కొంతమంది సీరియల్ ఆర్టిస్టులతో పాటు జబర్దస్త్ నుంచి కూడా కొంతమంది రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీరిలో వర్ష, బుల్లెట్ భాస్కర్, రియాజ్ , నరేష్, దుర్గారావు దంపతులు ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కొంతమంది పేర్లు బాగా వైరల్ అవుతుండగా హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారు అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సీజన్ ఎలా ప్రేక్షక ఆదరణ పొంది సక్సెస్ దిశగా వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: