టీవీ: భార్యతో విడాకులపై అధికారిక ప్రకటన చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Divya
బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కార్తీ తాజాగా తన వివాహ బంధానికి ముగింపు పలుకుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. తన భార్య అర్పిత తో విడాకులు తీసుకున్నట్లు పైగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. పాత జ్ఞాపకాలు అన్నీ కూడా మరిచిపోయి అతి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు కిరిక్ కీర్తి వెల్లడించారు. ఇక ఈ జంట పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ఇందులో ఇప్పటికే ఈ జంటకు ఒక కుమారుడు కూడా జన్మించారు. ఇకపోతే గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు పలుసార్లు రూమర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యేలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇన్స్టాలో కిరిక్ కీర్తి ఇలా రాసుకు వచ్చారు.. ఈరోజు చట్ట ప్రకారమే మేము విడిపోయాము.. అర్పిత నాకు మధ్య బంధానికి ఇప్పుడు పూర్తిగా స్థిరపడింది. ఇకనుంచి నా వ్యక్తిగత విషయాలతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపై ఉండదు కూడా.. అధికారికంగా మేము ఇక విడాకులు తీసుకున్నాము. చేదు జ్ఞాపకాలను మరిచిపోయి.. ఇక మీ ప్రేమ, ఆశీస్సులు భవిష్యత్తులో నాపై కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు కిరిక్ కీర్తి. ఇకపోతే 2023 ఫిబ్రవరిలో డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కిరికి కీర్తి వెల్లడించడం గమనార్హం. తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాను అని జీవితం మరింత ప్రశ్నార్థకంగా మారిపోయింది అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే వీరిద్దరూ మొదటిసారి కాలేజీలో కలుసుకోగా ఆ తర్వాతే వీరి మధ్య స్నేహం మరింత పెళ్లి బంధంగా మారింది అయితే వీరు పెళ్లికి ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అంతేకాదు అర్పిత వివాహానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదని సమాచారం. కానీ ఎట్టకేలకు ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఆమె పెళ్లి చేసుకుంది కానీ అతనితో ఎక్కువ కాలం జీవించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: