TV: బిగ్ బాస్ 7 లోకి వివాదాస్పద జర్నలిస్ట్.. కట్ చేస్తే..!
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక మసాలా.. 18, 19 మంది సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించి వారి మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేసి.. కంటెంట్ రాబడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఉంటారు. ఇప్పటికే ఆరు సీజన్ లలో దాదాపు అన్ని సీజన్ లు కూడా బిగ్ బాస్ కి ఇది బాగానే వర్క్ అవుట్ అయింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వస్తున్నారు అన్న విషయం వైరల్ గా మారింది. అందులో భాగంగానే టాలీవుడ్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ సురేష్ కొండేటి ఎప్పుడో సినీ రంగంలో నటుడుగా రాణించాలని హైదరాబాద్ కి వచ్చారు. ఎక్కడో పాలకొల్లులో పుట్టి పెరిగిన ఈయన హైదరాబాద్ వచ్చి.. జర్నలిస్టుగా సెటిల్ అయ్యి తనకున్న పరిచయాలతో ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారి బాగానే వెనకేసుకున్నారు. ఇక తర్వాత నాగార్జున సంతోషం సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా ఆ సినిమా పేరు నే ఒక పత్రికను పెట్టి సినీ వార్తాపత్రికను నడుపుతున్నారు. ఇకపోతే సినిమా ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాతలను నటీనటులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ కారణమవుతూ వచ్చారు. ఇక ఇలా కాంట్రవర్సీకి కారణమైన ఈయనను హౌస్ లోకి వస్తే మరింత వివాదంగా మారుతుందో చూడాలి.