టీవీ: బుల్లితెరపై నాగార్జున సీటుకే ఎసరు పెట్టిన బాలయ్య.. ఎవరిది పై చేయి..?
ఈ నేపథ్యంలోనే తాజాగా సీజన్ 7 కి సంబంధించి ప్రోమోను విడుదల చేయగా ఇందులో హోస్ట్ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. కేవలం లోగో మాత్రమే చూపించారు . మరొకవైపు ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారని కొంతమంది అంటుంటే మరి కొంతమంది లేదు నాగార్జున హోస్ట్ గా చేయడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఏడవ సీజన్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ ఉండదేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో ప్రోమో రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. జూలై ఆఖరి వారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనలైజ్ అయ్యిందట. ఇక ఆరవ సీజన్ కి హోస్టుగా నాగార్జున పెద్దగా మెప్పించ లేకపోవడం వల్లే ఇప్పుడు బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించిన ఈయనపైనే బిగ్ బాస్ నిర్వహకులు నమ్మకం పెట్టుకున్నారట. మరొకవైపు రానా పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఎక్కువగా సక్సెస్ రేట్ ఉన్న బాలయ్యకే నిర్వాహకులు పట్టం కట్టబోతున్నారని సమాచారం. మరి ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలంటే సీజన్ మొదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.