టీవీ: బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోలు వీళ్లే..!
మెగాస్టార్ చిరంజీవి:
రెండు దశాబ్దాల క్రితమే వాణిజ్య ప్రకటనల ద్వారా బుల్లితెరపై కనిపించిన చిరంజీవి.. ఆమధ్య చాలా కాలం గ్యాప్ తీసుకొని యూటర్న్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అయితే రాజకీయాలలో సక్సెస్ కాలేక మళ్లీ సినిమాలలోకి వచ్చిన ఆయన అటు సినిమాలు ఇటు బుల్లితెరపై కూడా కనిపించి దూకుడు ప్రదర్శించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించి.. 2017లో ప్రసారమైన ఈ నాలుగో సీజన్ కి హోస్టుగా ఈయన చేయడం గమనార్హం.
నాగార్జున:
2014లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఈ మన్మధుడు.. మూడు సీజన్ల వరకు ఈ షో కి హోస్టుగా చేశారు. ఆ తర్వాత బిగ్బాస్ యాంకర్ గా మారి ఇప్పుడు ఏడవ సీజన్ కి కూడా ఆయనే హోస్ట్గా రాబోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్:
బుల్లితెరపై ఎక్కువగా షోలకు హోస్ట్ గా చేసిన ఈయన మొదటిసారి తెలుగు లో 2017లో బిగ్బాస్ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత మీలో ఎవరు కోటీశ్వరులు సీజన్ కి వ్యాఖ్యాతగా మారి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.
నాని:
వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన.. బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.. బిగ్ బాస్ రెండవ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి తెలుగు వారికి మరింత దగ్గరైన నాని.. బిగ్ బాస్ రెండవ సీజన్ కి హోస్ట్ గా చేశారు. ఇక వీరే కాకుండా మరికొంతమంది కూడా వెండితెరపై అలరించారు.