టీవీ: ఏంటి జబర్దస్త్ నరేష్ కి ఇంత కష్టమా..?

Divya
జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ వారికంటూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే .ముఖ్యంగా సినిమాలలో అవకాశాలు రాకపోయినా సరే జబర్దస్త్ లో నటిస్తే చాలు తమకంటూ మంచి పేరుతో పాటు ఫేమ్ కూడా వస్తుంది అని అలాగే ఆర్థికంగా కూడా సెటిల్ అవ్వచ్చు అని ఆలోచించే వారి సంఖ్య చాలానే ఉంది. ఇప్పటికే గతంలో ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి కూడా లేకుండా ఎన్నో అవస్థలు పడిన చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత భారీగా ఆస్తులను కూడబెట్టారని చెప్పవచ్చు.

ఇక అలాంటి వారిలో పొట్టి నరేష్ కూడా ఒకరు అని చెప్పాలి. అది తక్కువ వయసున్న వ్యక్తిగా కనిపించే నరేష్ కి 23 సంవత్సరాలు.. జూలై 17 2000 వ సంవత్సరంలో జన్మించిన ఇతని జన్మస్థలం హైదరాబాద్. ఇకపోతే గ్రామంలో ఉంటూనే ఆర్థిక ఇబ్బందుల వల్ల హైదరాబాద్ కి వచ్చి ఒక కంపెనీలో ఆయన తల్లిదండ్రులు పనిచేసేవారు. ఆ తర్వాతే వీరికి నరేష్ జన్మించాడు. ఇక నరేష్ పుట్టినప్పటినుంచి పొట్టిగానే ఉండడంతో అతి తక్కువ బరువుతోనే పుట్టాడట. ఇకపోతే ఇది చూసిన డాక్టర్ మీ అబ్బాయి అందరికంటే తక్కువ బరువు తక్కువ పొడుపుతో పుట్టాడు బ్రతుకుతాడో లేదో అని కూడా చెప్పారట. కానీ నరేష్ మాత్రం చాలా యాక్టివ్ గా ఉండడంతో అతనికి అన్ని టెస్టులు నిర్వహించి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు.

ఇక వయసు పెరిగే కొద్దీ మంచి ఆహారం పెట్టాలి అని వైద్యులు సూచించారు. కానీ వారిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇక తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయన చదువును మధ్యలోనే మానేసి నటన మీద ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా ఒకప్పుడు పలు షోలు , ఈవెంట్లతో మంచి బిజీగా ఉన్న నరేష్ ఈమధ్య జబర్దస్త్ లో టీం లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం నరేష్ కోట్లలో సంపాదిస్తూ తన తల్లిదండ్రులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు అనేది భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: