టీవీ: హీరోగా మారిన పబ్లిక్ టాకర్ లక్ష్మణ్ బ్రో..!
అయితే మీరు అనుకుంటున్నట్టు హీరో సినిమాలలో కాదులేండి సీరియల్స్ లో.. ఈమధ్య జెమినీ టీవీలో అర్ధాంగి అనే ఒక సీరియల్ మొదలైంది ఇందులో హరిత లాంటి సీనియర్ నటీనటులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇందులో లక్ష్మణ్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సీరియల్ ప్రేక్షకుల ఆదరణ కూడా బాగానే సంపాదించుతుంది అమాయకత్వంగా సాగే హీరో పాత్రలో లక్ష్మణ్ చాలా బాగా నటిస్తున్నాడు. ఒకవైపు కామెడీతో మరొకవైపు తన యాక్టింగ్ తో విపరీతంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడని చెప్పాలి. ముఖ్యంగా థియేటర్ల వద్ద నానా హంగామా సృష్టించే లక్ష్మణ్ ఇలా సైలెంట్ గా హీరో అయిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇది చూసిన ప్రతి ఒక్కరూ బ్రో ఏంది బ్రో ఇది అంటూ సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే వైజాగ్ కి చెందిన ఈయన అందరిలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా రివ్యూ చేస్తూ థియేటర్ వద్ద బయటకు కనిపిస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఉంటాడు . వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించాడు. ఇకపోతే ఎప్పటికైనా సరే సినిమాలలో హీరో అయ్యి తన రివ్యూ తానే చెప్పుకోవాలనేది ఆయన కోరిక కానీ ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక అడుగు ముందుకు వేసి సీరియల్ హీరో అయిపోయారు