టీవీ: సీరియల్ నటి శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Divya
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో కొంతమంది నటీనటులు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తిండి పోతూ ఉంటారు. అలాంటి వారిలో నటి శిరీష కూడా ఒకరు. తన అందం,  నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆమె గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విషయాలు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. శిరీష సిరిసిల్లలో జన్మించింది.. ఆమె తండ్రి పేరు పాపయ్య శిరీషకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు.. అందులో ఒకరు రజిత,  మరొకరు సౌజన్య.
శిరీష మొదటి యొక్క రజిత 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకొని తన భర్త ప్రోత్సాహంతోనే మొదటిసారి దూరదర్శన్ లో అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించింది.  ఇక శిరీష రెండవ అక్క సౌజన్య కూడా తన అక్క రజిత బాటలోనే వెళ్లి కొన్ని సీరియల్స్ చేసి తనకంటూ కూడా అందరు ఇలాగే మంచి పేరు దక్కించుకుంది.  ఇక అందరికంటే చిన్నదైనా శిరీష మొదట్లో చిన్న చిన్న సీరియల్స్ చేసిన ఈమె మొగలిరేకులు సీరియల్ లో నటించిన పాత్రకు గాను శిరీష కు మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా లభించింది.
మొగలిరేకులు సీరియల్ తర్వాత నటి శిరీష మళ్ళీ తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు స్వాతి చినుకులు,  మనసు మమత , రాములమ్మ, కాంచన గంగ,  నాతిచరామి వంటి సీరియల్స్ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఒక వ్యక్తిగా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది శిరీష.  ఇకపోతే ఎక్కడో సిరిసిల్లలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన నటనతో అందరి చేత మెప్పు పొందుతోంది. ఏది ఏమైనా శిరీష కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: