టీవీ: అవకాశాలు లేక షకలక శంకర్ ఏం చేస్తున్నారో తెలుసా..?

Divya
గతంలో జబర్దస్త్ షోలో తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించిన కమెడియన్లలో షకలక శంకర్ కూడా ఒకరు. మంచి పాపులారిటీ రావడంతో పాటు కమెడియన్ గా గుర్తింపు సంపాదించారు..ఇలా వచ్చిన పాపులారిటీతో పలు చిత్రాలలో నటించి కమెడియన్ గా పేరుపొందిన షకలక శంకర్.. ఆ తర్వాత హీరోగా కూడా పలు సినిమాలలో ట్రై చేశారు. కానీ ఇవన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే ఇలా షకలక శంకర్ కాకుండా చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రస్తుతం షకలక శంకర్ ఏం చేస్తున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం
జబర్దస్త్ లో ఉన్న సమయంలో డబ్బులు బాగా వస్తున్న కొద్దీ హ్యాపీగా తన కెరీర్ ను కొనసాగించారు షకలక శంకర్. అయితే ఇండస్ట్రీలోకి వెళ్లిన తరువాత అందరికీ జ్ఞానోదయం అయింది.  చాలామంది కమెడియన్స్ తాము హీరోలు అవ్వలేమని దీంతో తిరిగి జబర్దస్త్ లోకి రియంట్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమం లోనే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక తిరిగి జబర్దస్త్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు షకలక శంకర్.. ఇక గతంలో పలు చిత్రాలలో హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో షకలక శంకర్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి సైలెంట్ గానే ఉండడంతో తిరిగి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మొదట్లో జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న షకలక శంకర్.. తిరిగి జబర్దస్త్ లోకి వచ్చినా సక్సెస్ అవుతారా లేదా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. కానీ సినీ అవకాశాలు రాలేకపోవడంతో జబర్దస్త్ లోకి వచ్చి తన కామెడీ టైమింగ్ తో మళ్లీ కొత్తగా ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే షకలక శంకర్ మాత్రమే కాకుండా చాలామంది కమెడియన్స్ సైతం ఇప్పుడు తిరిగి బుల్లితెర పైన ఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: