టీవీ: మొదటిసారి బ్రేకప్ పై నోరు విప్పిన నవ్య స్వామి..!

Divya
నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర హీరోయిన్స్ లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్య స్వామి తన బ్రేకప్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. వాస్తవానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన టీవీ నటుడు రవికృష్ణ తో ఈమె ప్రేమలో ఉంది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అంతే కాదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి ఆమె కథ అనే సీరియల్ కూడా చేశారు.  ఇక ఈ సీరియల్ లో రవికృష్ణ , నవ్య స్వామి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి. ఇక ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం , వరుస ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ఉండడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల విరూపాక్ష సక్సెస్ మీట్ లో రవి కృష్ణను ఇదే విషయం అడగ్గా ఆమె ఒప్పుకుంటే తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. కానీ నవ్య స్వామి మాత్రం తాను ,రవికృష్ణ మంచి స్నేహితులం మాత్రమే అంటూ కొట్టి పారేసింది.
ఈ నేపథ్యంలోనే తన బ్రేకప్ గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు తాను ప్రేమలో ఉన్న విషయం నిజమేనని ఒప్పుకున్న ఈమె
.. అయితే ఆ ప్రేమ వర్కౌట్ కాకపోవడం వల్లే తప్పుకున్నానని చెప్పుకొచ్చింది. అలాగే ఆ తర్వాత ఆ వ్యక్తితో మళ్ళీ మాట్లాడలేదని తెలిపి.. ఆ మాట చెబుతూ కన్నీరు కార్చింది.  దీంతో అక్కడున్న వారంతా నిజంగా అతడిని ఎంతగా ప్రేమించిందో ఏమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అవన్నీ మర్చిపోయి సంతోషంగా సీరియల్స్, షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది నవ్య స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: