టీవీ: రష్మీ నిజంగానే సుధీర్ ను ఇష్టపడుతోందా..?

Divya
బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బుల్లితెర షోలతోనే కాదు సినిమాలలో కూడా అలరించి మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో అందచందాలతో యువతకు గిలిగింతలు పెడుతూ ఉంటుంది.. అయితే జబర్దస్త్ లో క్రేజ్ అందుకున్న వారిలో యాంకర్ రష్మి కూడా ఒకరు అయితే ఆమె పేరు ప్రస్తావిస్తే.. ఖచ్చితంగా సుదీర్ గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది.
నిజానికి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని కొంతమంది చెబితే మరి కొంతమంది లేదు అని వాదిస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రోగ్రాం కోసమే వీళ్లిద్దరి మధ్య లవ్ సృష్టించారని ఇలా రకరకాల కామెంట్లు అయితే వినపడుతూ ఉంటాయి.అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ హిట్ గా ఉంటుందని చెప్పాలి. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది కొన్ని షోలలో అయితే కలిసి పెళ్లి చేసుకుని అభిమానులను ఫూల్స్ కూడా చేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు జబర్దస్త్ నుంచి సుధీర్ దూరం అవడంతో అటు రష్మీ, ఇటు సుదీర్ మధ్య గ్యాప్ కూడా కొంచెం పెరిగింది అని చెప్పాలి. సుధీర్ మీద ఉన్న ప్రేమ మాత్రం రష్మి లో ఏమాత్రం తగ్గలేదు అనే విషయాన్ని తాజాగా ఆమె మరొకసారి నిరూపించింది. ఇటీవల తన మనసులో ఇంకా సుదీర్ ఉన్నాడనే విషయాన్ని ఒక షో వేదికగా గుర్తుచేసుకుంది. తాను ఒంటరిగా ఉండాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా తనకు సుధీర్ తోడు అయితే తప్పకుండా కావాలి అని ఆమె కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత సంచలనానికి దారితీస్తోంది.  దీన్ని బట్టి చూస్తుంటే రష్మీ ఇంకా సుదీర్ ని మర్చిపోలేదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వీళ్ళు మళ్ళీ కలవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: