టీవీ: జబర్దస్త్ వల్ల పైమా ఎంత సంపాదించిందో తెలుసా..?

Divya
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో లేడీ కమెడియన్ పైమా కూడా ఒకరు. ఒక నిరుపేద కుటుంబం నుంచి పుట్టిన ఈ అమ్మాయి గతంలో అద్దె ఇంట్లో జీవనం గడుపుతూ ఉండేది. తన తల్లి కూడా బీడీలు చుట్టుకుంటూ ఉండేదని .. తమ కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి చాలా కష్టాలు పడిందని తెలియజేసింది. ఫైమా అందరికంటే చిన్న అమ్మాయి కావడం చేత కుటుంబం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా కష్టాలు పడి బుల్లితెరపైకి వచ్చానని తెలియజేసింది
అయితే బుల్లితెరపై పటాస్ కార్యక్రమం ద్వారా మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన పైమా అందులో మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో.. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది. అలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఫైమా బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ద్వారా కూడా ఫైమా భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది. స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా బాగానే సందడి చేస్తోంది పైమా.
ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఏమి పలు రకాల షార్ట్ ఫిలింలో కూడా నటించింది. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఉండే ప్రేమ ఇప్పుడు ఒక సొంత ఇల్లును కూడా కట్టుకొని ఆర్థికంగా స్థిరపడినట్లు తెలుస్తోంది. మరొకవైపు యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది దాదాపుగా ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అయితే ఇదంతా కేవలం ఫైమా బుల్లితెర పైన అడుగుపెట్టి ఇంతలా సంపాదించిందని అభిమానులు భావిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో సినిమాలలోనైనా నటించి దీన్ని అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి మరి. జబర్దస్త్ లోకి ఫైమా రీ యంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: