టీవీ: శ్రద్ధ దాస్ తో రొమాన్స్ చేస్తున్న శేఖర్ మాస్టర్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించిన వారిగా శేఖర్ మాస్టర్ కూడా ఒకరు.. ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి ఢీ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి మంచి పాపులారిటీ సంపాదించారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. అలా ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఢీ షో మాత్రం విజయవంతంగా 15వ షోని పూర్తి చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ తో పాటు మరి కొంతమంది జడ్జిలు కూడా ఉన్నారు.

ఇప్పటికే ప్రియమణి ,సదా, పూర్ణ వంటి హీరోయిన్స్ సైతం ఈ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది. తాజాగా శ్రద్ధాదాస్ ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే స్టేజ్ పైన శేఖర్ మాస్టర్ శ్రద్ధదాస్తో కలిసి రొమాన్స్ చేస్తూ డాన్స్ చేయడం జరిగింది. తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఇక శ్రద్ధ దాస్ తో కలిసి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేసిన కళావతి అనే పాటకు డాన్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా శ్రద్ధదాస్ ని ఎత్తుకొని మరీ తిప్పుతూ రొమాన్స్ చేశారని ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.

ఈ విధంగా ఈ ప్రయోగాలు శేఖర్ మాస్టర్ శ్రద్ధదాస్ పర్ఫామెన్స్ చూసిన పలువురు బుల్లితెర ప్రేక్షకులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ రొమాంటిక్ పర్సన్ అంటూ కొంతమంది కామెంట్ చేయగా హీరోయిన్స్ తో కూడా ఇలా రొమాన్స్ చేయడం ఏంటి మాస్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మరింత ఘాటుగా స్పందిస్తున్నారు శ్రద్ధదాస్ విషయానికి వస్తే ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పలు వెబ్ సిరీస్లలో నటిస్తూనే పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ సందడి చేస్తూనే ఉంది. అవకాశాలు లేకపోయినా గ్లామర్ షో చేయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: