టీవీ: సీరియల్ నటుడు రవి కృష్ణ.. లైఫ్ లో కూడా ఇన్ని కష్టాలా..?

Divya
బుల్లితెర నటుడుగా సీరియల్స్ లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు రవి కృష్ణ. మొదటిసారిగా వెండితెరపై విరూపాక్ష చిత్రంలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తను నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనను కనపరిచి ప్రశంశాల వర్షం అందుకున్నారు రవికృష్ణ. ఈ సినిమా ద్వారా తను నటనతో తానేంటో తనని ప్రూఫ్ చేసుకునే అవకాశం లభించిందని చెప్పవచ్చు. విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఈయనకు వెండితెర పైన కూడా అవకాశాలు వెలుపడతాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడిన రవికృష్ణ ఒకానొక సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్టర్ దగ్గర కూడా ఇండస్ట్రీలో పని చేశానని తెలిపారు అయితే ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది రవి క్రిష్ణ. రవి కృష్ణ మాట్లాడుతూ రవికృష్ణ విజయవాడకు చెందిన అబ్బాయి తన తండ్రి ఆర్టీసీ ఉద్యోగి తల్లి గృహిణి .. డిగ్రీ వరకు విజయవాడలో చదివిన రవికృష్ణ ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేశారట. చూడడానికి హీరోలాగా ఉన్నప్పటికీ సినిమాలలో తొందరగా అవకాశాలు అందుకుంటారని అందరూ అనుకున్నారు.

కానీ పెద్దగా అవకాశాలు ఏమి రాలేదట. అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలియజేశారు. తన టాలెంట్ మాత్రమే కాకుండా అదృష్టం కూడా ఉండాలని దేవుడిపైన భారం వేసి ఆ తర్వాత ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం అందుకున్నారని తెలిపారు. అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్గా ముందుకు సాగుతున్న సమయంలో విజేత, విజయం అనే సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందని అలా తన కెరియర్ మొదలయిందని తెలిపారు. ఆ తరువాత బొమ్మరిల్లు, మొగలిరేకులు వంటి సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: