టీవీ: వయసు మీద పడుతున్నా పెళ్లికి దూరం అంటున్న బుల్లితెర సెలబ్రిటీలు వీళ్లే..!

Divya
సాధారణంగా వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా ఇంకా పెళ్లి కానీ బ్రహ్మచారులు చాలామంది ఉన్నారని చెప్పాలి. ఒకప్పుడు పెళ్లి గురించి చాలామంది ఆలోచించే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కెరియర్ పైన ఫోకస్ పెట్టడం వల్ల పెళ్లి అనే పదానికి దూరం అవుతున్నారు. వాస్తవానికి అప్పట్లో పెళ్లి వయసు వచ్చేసిందని లేట్ అయితే ముదురు బెండకాయ అంటారని అందరూ కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు 30 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నట్టే లెక్క. ఎందుకంటే చదువు, ఉద్యోగాల పేరు చెప్పి అప్పటివరకు చాలామంది నెట్టుకొస్తున్నారు.
ఇకపోతే ఇక మునుముందు భవిష్యత్తులో పెళ్లి అంటేనే బాబోయ్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మరి ఇప్పటివరకు వయసు మీద పడుతున్నా పెళ్ళికి నోచుకోని బుల్లితెర సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం.
రష్మీ గౌతమ్:
30 సంవత్సరాలు దాటినా సరే ఇంకా వివాహం అనే పదానికి దూరంగా ఉంది . వికీపీడియా ప్రకారం చూసుకుంటే ఈమె వయసు 32 ఏళ్లు. కానీ సినిమాలు,  బుల్లితెర షోలు అంటూ  సందడి చేస్తోంది తప్ప వివాహం అనే పదానికి ఇంకా దూరంగానే ఉంది.
విష్ణు ప్రియ:
33 సంవత్సరాల వయసు వచ్చిన ఈ అమ్మడు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు.  వరుస టీవీ షోలు,  సినిమాలు అంటూ తన బ్యాచిలర్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది.
సుడిగాలి సుదీర్:
బుల్లితెర బిజీ ఆర్టిస్టులలో ఒకరైన సుధీర్ 33 సంవత్సరాలు వచ్చినా ఇంకా వివాహం చేసుకోకుండా హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలలో హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్.
హైపర్ ఆది:
ఎనర్జిటిక్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన వయసు 31 సంవత్సరాలు. ప్రస్తుతం వరుస సినిమాలు టీవీ షోలు అంటూ లైఫ్ ను సాగదీస్తున్నాడు.
ప్రదీప్:
మోస్ట్ బిజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ వయసు 34 సంవత్సరాలు. ఇటీవల హీరోగా కూడా మారాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: