టీవీ: కీర్తి సురేష్ పాటకు మాస్ బీట్ తో డాన్స్ వేస్తున్న ఇంద్రజ..!!
ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ పెళ్లికూతురి చీర గెటప్లో అదిరిపోయే మాస్ బీటుకు డాన్స్ వేయడం జరిగింది. కీర్తి చేసిన ఈ డాన్స్ కు ఎంతోమంది సెలబ్రిటీలు కూడా రీల్స్ చేయడం జరిగింది. తాజాగా సీనియర్ నటి ఇంద్రజ కూడా ఈ మాస్ బిట్ కు అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇంద్రజ తన జడ్జిమెంట్ తో పాటు అప్పుడప్పుడు పాటలు పాడడం డాన్స్ వేయడం వంటివి కూడా చేస్తూ ఉంటుంది.
ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించిన ఇంద్రజ.. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ 20 షోలలో కూడా పంచ్ డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది ఇంద్రజ. తాజాగా ఈ షో కి సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల కావడం జరిగింది. ఇందులో దసరా సినిమాలో కీర్తి సురేష్ డాన్స్ వేసిన స్టెప్పులకు ఇంద్రజ తనదైన స్టైల్ లో స్టెప్పులు వేసి రచ్చ చేస్తోంది. ఈ ప్రోమోలో ఇంద్రజ చేసిన డాన్స్ హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వయసులో కూడా ఇంద్రజ వేసిన ఈ స్టెప్పులు ఆడియన్స్ కి షాక్ అయ్యేవిధంగా ఉన్నాయి.