టీవీ: హీరోయిన్లను మించిన అందంతో సింగర్ సునీత కుమార్తె..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో టాప్ సింగర్ గా ఈమె మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. తన అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ఎన్నో అవార్డులను రివార్డులను సైతం అందుకుంది. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది హీరోయిన్లకు ఎన్నో సినిమాలు డబ్బింగ్ చెప్పింది ఒకవైపు పాటల కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది. మొదట గులాబీ సినిమాలోని పాటలు పాడి తన సినీ కెరియర్ను మొదలుపెట్టింది.
ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి విజయాలను అందుకుంది. సునీత వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. గడచిన రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంది. సునీతకు ఇద్దరు పిల్లలు కలరు. అందులో అబ్బాయి పేరు ఆకాష్ అమ్మాయి పేరు శ్రేయ.. సునీత కుమారుడు ఆకాష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించబోతున్న సర్కార్ నౌకరి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది.
ఇకపోతే సింగర్ సునీత కుమార్తె శ్రేయ.. కూడా తన తల్లిలాగే చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె విదేశాలలో చదువుకుంటున్నట్లు తెలుస్తోంది.  నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమాలో సునీత కూతురు ఒక పాట పాడింది. ఈమె గాత్రం కూడా బాగుందని సంగీతం అంటే చాలా ఇష్టం అని కూడా తెలియజేసింది. కానీ ఇటీవల ఫారిన్ లో చదువుతున్న తన కూతురును కలిసేందుకు వెళ్లిన సునీత అక్కడ తన కూతురిని కౌగిలించుకొని ఎమోషనల్ అవుతున్న ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం సునీత కూతురు హీరోయిన్లను మించిన అందంతో ఉంది.  హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: