టీవీ: రష్మీ గౌతమ్ లవ్ లో ఫెయిల్ అయ్యిందా.. దాని అర్థం ఏంటి..?

Divya
జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన కెరియర్ను మొదలుపెట్టిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది. అంతేకాదు సినిమాలలో గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. బోల్డ్ సన్నివేశాలలో కూడా అంతకుమించి బోల్డుగా నటించిన రష్మీ.. ఇక సోషల్ మీడియాలో సమాజంలో జరిగే ప్రతి అంశంపై కూడా స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రోజుకు ఒక ఫోటో షూట్ షేర్ చేసే ఈమె సమాజంలో మూగ జంతువులపై జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా జబర్దస్త్ షోలో సుడిగాలి సుదీర్ తో ప్రేమాయణం నడిపిన రష్మీ అతన్ని వివాహం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు.  కానీ అది కేవలం జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ కోసం మాత్రమేనని.. వారిద్దరూ పెళ్లి చేసుకోమని స్పష్టం చేశారు. ఇక అయినా కూడా ఇప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురుచూసే అభిమానులు కూడా కోకొల్లలు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా రష్మీ తన లవ్ లో ఫెయిల్ అయ్యారు అంటూ ఒక వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల చేశారు.  అందులో ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న అసలు సినిమా డైరెక్టర్ కం హీరో రవి బాబు గెస్ట్ గా వచ్చారు. ఆయనతోపాటు బ్రహ్మాజీ కూడా హాజరయ్యారు. అనంతరం వీరంతా కలిసి అటు రష్మీ ని ఇటు ఇంద్రజను కూడా ఆటపట్టించారు. ప్రోమో ఎండింగ్ లో భాగంగా ఒక పాప్ కార్న్ డబ్బా ఉంచి అందులో రాయి వేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా తమ కోరికలను బయటికి చెబుతూ రాయి వేస్తూ వచ్చారు. ఇక రష్మి కూడా తన లైఫ్ లో లవ్ పై బెట్ వేస్తూ.. అందులో రాయి పడితే తన లైఫ్ లో లవ్ సక్సెస్ అయినట్టు లేకపోతే ఫెయిల్యూర్ అయినట్టు చెప్పి మరి రాయి వేసింది. కానీ ఆ రాయి అందులో పడలేదు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.  ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: