టీవీ: సుధీర్, ఇంద్రజ ల పరువు తీసేసిన బుల్లెట్ భాస్కర్..!

Divya
బుల్లితెరపై సుధీర్ ,గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ముగ్గురిదీ హిట్ కాంబో అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు కూడా వెండితెర పైన నవ్వులు పూయించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఇక త్రీ మంకీస్ అంటూ మీరు ముగ్గురూ కలిసి సినిమా చేసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు ఇక సుధీర్ నటించిన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. గాలోడు సినిమాతో మళ్ళీ హిట్ సొంతం చేసుకున్నాడు. గాలోడు సినిమా ఆయన సినీ కెరియర్ లోనే ఫస్ట్ టైం హిట్ ఇచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో థాంక్యూ స్పెషల్ ఈవెంట్ చేయడం జరిగింది.  ఈ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను , సుధీర్ కూడా హాజరవ్వడం మనం చూడవచ్చు.  చాలా రోజుల తర్వాత సుధీర్ , రాంప్రసాద్,  గెటప్ శ్రీను ముగ్గురు ఒకే స్టేజిపై కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. అయితే ఈ ముగ్గురిని కలిసి చూడడంతో ఇంద్రజ ఉబ్బితభిపోయింది ఇక ఆమె కడుపు నిండినట్టు అయింది. ఇకపోతే వీరి ముగ్గురిని ఒకే స్టేజిపై చూసిన బుల్లెట్ భాస్కర్, పంచ్ ప్రసాద్ తమ పంచ్ లతో వారిని పూర్తిగా ఇబ్బంది పెట్టేశారనే చెప్పాలి.
గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్,  3 మంకీస్ సినిమాలు ఎవరు చూశారు..? థియేటర్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. నా పిల్లల్ని 30 రోజులు నేను థియేటర్కు తీసుకెళ్లాను. కానీ ఎవరూ లేరు చక్కగా వారు ఆడుకున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. ఇక నాకు మొన్నటి వరకు మోకాలు నొప్పి ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు సుదీర్ సినిమాకు వెళ్ళిన తర్వాత తలనొప్పి ఎక్కువైంది. ఆ దెబ్బతో మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది అంటూ కౌంటర్లు వేశారు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలోఆవిడ అమ్మగా ఇంద్రజ నటించిన సుధీర్ అలా పిలుస్తాడని రాంప్రసాద్ చెబుతాడు. అప్పుడు వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా అవునా మీరు అందులో నటించారా? ఎందుకు నటించారు? ఉచితంగా నటించారా? డబ్బులు తీసుకొని నటించారా? అంటూ ఉన్న పరువును కాస్త తీసేసారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: