టీవీ: కన్నీరు పెట్టిస్తున్న రచ్చ రవి కామెంట్స్.. ఆమె అంటే ఇంత ప్రేమనా..?

Divya
సాధారణంగా ఉరుకుల పరుగుల జీవితంలో బంధాలకు.. బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న గొడవలతో అయిన వాళ్లే దూరం అవుతున్నారు. కానీ అంతా మనవాళ్లే అనుకొని కలిసిమెలిసి ఉంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.. ఇదే విషయాన్ని దర్శకుడు వేణు బలగం సినిమాతో నిరూపించాడు. ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే రచ్చ రవి నిజ జీవితంలో కూడా బలగం సీన్ ఎదురైందట.. తాను ఎంతగానో ప్రేమించిన తన చెల్లి మాట్లాడడం లేదని కన్నీరు మున్నీరుగా విలపించాడు రచ్చ రవి..
రచ్చ రవి జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు.  ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు రావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక జబర్దస్త్ కు దూరమైన విషయం తెలిసిందే. అలా ఇప్పుడు బలగం సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని మళ్ళీ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చెల్లిని తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు రచ్చ రవి.. 2016లో మా ఇంటి గృహప్రవేశం జరిగింది.. అప్పుడు వచ్చిన చెల్లె రజిత ఆ తర్వాత ఎన్నడూ మా ఇంటికి రాలేదు.. తాను ఇచ్చిన 123 రూపాయలతో హైదరాబాద్ కి వచ్చాను..  ఎన్నో తిప్పలు పడి ఈ స్థాయికి వచ్చాను.. నాకు సమయం లేక తనతో సరిగా మాట్లాడలేదు.. కానీ దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకొని నా ముఖం చూడడమే మానేసింది.. ఎన్నిసార్లు బ్రతిమిలాడిన ఇంటికి రానని తెగదెంపులు చేసుకుంది..
ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను తిట్టాలి కానీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. నా ఇంటికి మాత్రం రావడం లేదు.. రాఖీ పండుగ వచ్చిన ప్రతిసారి నేనే తన ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నాను కానీ తాను మాత్రం మా ఇంటికి రాలేదు.. ఒకప్పుడు తాను ఇచ్చిన డబ్బులతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను.. చెల్లి గుర్తుకు వస్తే నాకు కన్నీళ్లు ఆగట్లేదు అంటూ తన మాటలతో అందరినీ కంటతడి పెట్టించాడు రచ్చ రవి.. అంతేకాదు మీ అన్న చేసిన బలగం సినిమా చూసి తప్పకుండా ఒకసారి వచ్చి నన్ను కలుస్తావని ఆశిస్తున్నాను.. ఒక్కసారి వచ్చిపోవమ్మా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: