టీవీ: జబర్దస్త్ స్టేజ్ పై యాంకర్ సౌమ్య - ఇంద్రజ మధ్య గొడవ.. కట్ చేస్తే..!

Divya
జబర్దస్త్ కామెడీ షో గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ కి నవ్వులు పంచుతూ ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈమధ్య కాలంలో తరచూ గొడవ లాంటి వాతావరణం బాగా క్రియేట్ అవుతుందని చెప్పాలి. జబర్దస్త్ కామెడీ షో లో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ కూడా ఇంద్రజతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా సౌమ్యరావు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా వచ్చే వారానికి సంబంధించి ఒక ఎపిసోడ్ ప్రోమోనో విడుదల చేయగా ఇందులో జడ్జి ఇంద్రజ యాంకర్ సౌమ్యరావు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.  ఇది కాస్త ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. శ్రీరామనవమి స్పెషల్ గా ఎపిసోడ్ ను నిర్వాహకులు ప్లాన్ చేయగా ఇందులో రాకెట్ రాఘవ పాన్ ఇండియా స్కిట్ అని స్కిట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు . ఆ తర్వాత యాంకర్ సౌమ్యరావు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని శ్రీదేవి పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేసింది. అనంతరం శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ రాగా అందులో కమెడియన్లు అంతా కూడా పండగ స్పెషల్ గా పానకాలు తయారు చేయడం మనం చూడవచ్చు.
అందరు చేసిన పానకాలను ఇంద్రజ టేస్ట్ చేశారు. సౌమ్య రావు అయితే  ఏకంగా గ్లాసులకు గ్లాసులే తాగేసింది అంతా అయిపోయాక పానకం ఎవరూ బాగా చేశారని సౌమ్య అడగగా వెంటనే రాఘవ బాగా చేశాడని ఇంద్రజ  చెబుతుంది. కానీ అది కాదు వెంకీ , తాగుబోతు రమేష్ లు చేసింది బాగా ఉంది అంటూ సౌమ్యరావు అడ్డు చెబుతుంది.. దీంతో ఖంగు తిన్న ఇంద్రజ లేదు రాఘవది బాగుందని చెప్పి మళ్ళీ టేస్ట్ చేసింది.  సౌమ్య రావు అదే పనిగా తాగుబోతు రమేష్,  వెంకీ పానకం బాగుందని చెప్పడంతో కోపగించుకున్న రాకెట్ రాఘవ షో మధ్యలో నుంచి వెళ్లిపోయారు.  ప్రస్తుతం ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: