టీవీ: రష్మీ దారుణంగా అవమానించిన విశ్వక్ సేన్..!!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ హీరోకి కాస్త స్పీడు ఎక్కువ.. అప్పుడప్పుడు ఎన్నో సందర్భాలలో ట్రోల్ కి కూడా గురవుతూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలామంది నటులతో తిట్లు కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి అయినా కూడా విశ్వక్ సేన్ తన ప్రవర్తన మార్చుకోలేదు.. ఎవరికి ఏమాత్రం భయపడకుండా ఉంటాడు.. తాజాగా రష్మీ పైనా చేసిన వాఖ్యలు తెగ వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ అనే సినిమాలో నటించారు.  ఈ చిత్రంకి నిర్మాత,  డైరెక్టర్,  హీరో అన్నీ తానై  వ్యవహరించారు.  ఈ సినిమా ఉగాది కానుకగా విడుదలై మంచి విజయాలను అందుకుంది.. ఈ సినిమా గురించి పక్కన పెడితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన దాస్  కా ధమ్కీ మూవీ చిత్ర బృందం జబర్దస్త్ సెట్లో సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ఒక స్కిట్ లోను నటించడం జరిగింది.
ఈ సందర్భంగా లాంగ్ డ్రైవ్ కి వస్తావా రష్మీ అంటూ అడగగా.. అందుకు రష్మీ వస్తాను అంటూ ఎగిరి గంతేస్తోంది.  దీంతో అయితే వెళ్ళు అంటూ షాక్ ఇస్తారు విశ్వక్ సేన్.. దీంతో రశ్మి పరువు అంతా పోయింది అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందరి ముందే జబర్దస్త్ స్టేజ్ పైన రష్మీ పరువు తీయడంతో పాటు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమోలో పలు కామెడీ పంచ్ డైలాగులతో పాటు ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొదటిసారి ఇందులోకి అలనాటి నటి పాకీజా కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: