టీవీ: ఈ సీరియల్స్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Divya
ప్రస్తుత కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది బుల్లితెరకే అంకితం అవుతున్నారు. సినిమా అయితే కేవలం మూడు గంటలు మాత్రమే ప్రేక్షకులు అలరిస్తుంది కానీ సీరియల్ మాత్రం సంవత్సరాల తరబడి అలరిస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది బుల్లితెర నటీనటులకు కూడా భారీ పాపులారిటీ లభించింది. ఈ క్రమంలోనే సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ కి కూడా పారితోషకం భారీగా పెరిగిపోయిందని చెప్పాలి ఇకపోతే ప్రత్యేకించి కొంతమంది సీరియల్ హీరోయిన్స్ రేమ్యునరేషన్ లు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి
 వారి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.
కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించిన ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  వంటలక్కగా భారీ పాపులారిటే దక్కించుకున్న ఈమె అంతకుమించి రెమ్యునరేషన్ ని కూడా సొంతం చేసుకుంటోంది. ఇక రోజుకు రూ.30 నుంచి రూ. 50 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది ప్రేమీ విశ్వనాథ్.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ సీరియల్ హీరోయిన్ సుజిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల వదినమ్మ సీరియల్ తో కూడా ప్రేక్షకులను అలరించింది.  ఇక ఈమె ఒక్కరోజు పారితోషకం ఎంత అనే విషయానికి వస్తే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటానని సమాచారం.
ఇప్పుడు బుల్లితెర సీరియల్స్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కస్తూరి శంకర్ , రాశీ,  సుహాసిని వంటి సీరియల్ హీరోయిన్స్ కూడా రూ. 25 వేల వరకు రోజుకు పారితోషకం పుచ్చుకుంటున్నారు. వీరి తరువాత అర్చన అనంత,  శోభా శెట్టి తదితర నటీమణులు రోజుకు  రూ.15 నుంచి రూ.20వేల వరకు పారితోషకం అందుకుంటున్నారు.  ఇక వీరితోపాటు చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు భారీగా పారితోషకం అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా సైడ్ క్యారెక్టర్ లో నటించే అవకాశాలను సొంతం చేసుకుంటూ వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: