నువ్వు నేను ప్రేమ సీరియల్ విక్రమాదిత్య రియల్ లైఫ్ స్టోరీ..!

Divya
స్టార్ మా చానల్లో ప్రసారమవుతూ ప్రసారమైన కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్ నువ్వు నేను ప్రేమ.. ఈ సీరియల్ లోని నటీనటులు తమ అందంతో నటనతో ప్రేక్షకులను బాగా అలరించడమే కాదు సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో బాగా దూసుకుపోతోంది.. ఈ సీరియల్ లో పద్మావతి తో పాటు విక్రమాదిత్య క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇక ఈరోజు ఈ సీరియల్లో నటిస్తున్న విక్రమాదిత్య రియల్ లైఫ్ గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
విక్రమాదిత్య రియల్ పేరు స్వామినాథన్ అనంతరామన్.. మొదటి సీరియల్ తోనే ప్రేక్షకులను అలరించి తన నటనతో, అందంతో విపరీతంగా ఆకట్టుకుంటున్న స్వామినాథన్.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నవంబర్ 30వ తేదీన స్వామినాథన్ జన్మించారు. స్వామినాథన్ కన్నడ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక ఈయన విద్యాభ్యాసం విషయానికి వస్తే సహస్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తి కాగానే కొద్ది రోజులు ఇంజనీర్గా పనిచేసిన స్వామినాథన్.. చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి ఉండడంతో.. అవకాశం రావడంతో వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి నటన వైపు అడుగులు వేశారు.
అలాగే స్వామినాథన్ మంచి మోడల్ కూడా. మోడల్గా కొన్ని సంవత్సరాలు పాటు పనిచేసి భారీ  పాపులారిటీ దక్కించుకున్నారు. కాలేజ్ చదువుకుంటున్న సమయంలోనే స్వామినాథన్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.నటన  మీద ఇంట్రెస్ట్ తో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు స్వామినాథన్. కన్నడ సినిమాలలోను కన్నడ సీరియల్స్ లో కూడా నటించారు. కన్నడలో ప్రసారమైన ఇధవరాశి అనే సీరియల్ లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. అలాగే కొమరట్టు 2 అని సినిమాలో కూడా స్వామినాథన్ నటించారు. కాట్రివెన్నకేళి అనే తమిళ్ సీరియల్ లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు అదే గుర్తింపుతో తెలుగులో నటించే అవకాశాన్ని పొంది నువ్వు నేను ప్రేమ సీరియల్ లో హీరో క్యారెక్టర్ లో చేస్తున్నారు స్వామినాథన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: