టీవీ: నువ్వు నేను ప్రేమ సీరియల్ పద్మావతి రియల్ లైఫ్ స్టోరీ..!

Divya
స్టార్ మా చానల్లో గత కొన్ని నెలల క్రితం మొదలైన నువ్వు నేను ప్రేమ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకొని నటీనటులకు కూడా అంతకుమించి ఆదరణ లభిస్తోంది. గత ఎనిమిది నెలలుగా ఈ సీరియల్ బాగా ప్రేక్షకులను అలరించడమే కాదు టిఆర్పి రేటింగ్ లో కూడా దూసుకుపోతూ రికార్డు సృష్టిస్తోంది. ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న పద్మావతి అసలు పేరేంటి ? ఆమె రియల్ లైఫ్ స్టోరీ ఏంటి?అనేది ఇప్పుడు చూద్దాం.
పద్మావతి అసలు పేరు పవిత్ర బి నాయక్.. తెలుగులో చేస్తున్నది మొదటి సీరియల్ అయినప్పటికీ విపరీతమైన ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకున్నారు.. తన అందంతో,  నటనతో యువతను సైతం ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కర్ణాటక కు చెందినవారు. 1997 సెప్టెంబర్ 13వ తేదీన జన్మించిన ఈమె తన విద్యాభ్యాసాన్ని మొత్తం కర్ణాటకలోనే పూర్తి చేశారు. ఈమెకు ఒక సోదరి కూడా ఉన్నారు. తన చదువు మొత్తాన్ని కర్ణాటక బెంగళూరులో పూర్తి చేసిన పవిత్ర.. శ్రీకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో  గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పవిత్ర. చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం ఉన్న పవిత్ర చదువుకుంటున్నప్పుడే నటనను తన కెరియర్గా మార్చుకున్నారు.
ఈమె నటి మాత్రమే కాదు మోడల్ కూడా కన్నడ సీరియల్స్ లో , సినిమాలలో కూడా నటించి అలరించారు. రక్షాబంధన్ అనే సీరియల్ లో మొదటిసారి కన్నడ బుల్లితెర రంగ ప్రవేశం చేశారు పవిత్ర. ఆ తర్వాత పారుక్, కాదంబరి వంటి కన్నడ సీరియల్స్ లో నటించి మెప్పించారు. అంతేకాదు కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. పవిత్రకు కన్నడలో మంచి ఫాలోయింగ్ లభించడంతో అక్కడ్నుంచి తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు లభించాయి అలా తెలుగు బుల్లితెరకు పరిచయమైన పవిత్ర భవిష్యత్తులో మరెన్ని సీరియల్స్ లో నటిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: