టీవీ: నేను శైలజ సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్ స్టోరీ ..!

Divya
ప్రస్తుత కాలంలో బుల్లితెర సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆ సీరియల్స్ లో నటించే హీరో హీరోయిన్లు కూడా అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు . అందుకే తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి.. వారి రియల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆ హీరోయిన్ల రియల్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ క్రమంలోని ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న నేను శైలజ సీరియల్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇందులో శైలజా క్యారెక్టర్ లో నటించిన జయ హారిక అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఆమె బయోడేటా గురించి మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం. 1995 అక్టోబర్ 4న కాకినాడలో జన్మించింది ఈ తెలుగమ్మాయి..జయ హారిక కు ఒక సోదరుడు కూడా ఉన్నారు.. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే.. తన విద్యాభ్యాసం స్కూలింగ్ అంతా శ్రీ ప్రకాష్ సెనర్జీ,  స్కూల్లో పూర్తి చేసింది. ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్ , బీటెక్ జాగృతి కాలేజీలో పూర్తి చేసింది. బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది .
చిన్నతనంలోనే హారిక కూచిపూడి , భరతనాట్యం నృత్యాలను నేర్చుకుంది. నటన మీద ఆసక్తితో ఇంటర్ చదువుతున్న సమయంలోనే సినిమాలో మొదటిసారిగా నేను నా ఫ్రెండ్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రభస సినిమాలో సమంతకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించిన ఈమె పసుపు కుంకుమ సీరియల్ లో అలకనంద క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మేఘమాల వరూధిని పరిణయం, శ్రావణ సమీరాలు,  శృతి గీతం,  అక్క మొగుడు , పవిత్ర బంధం,  నేను శైలజ వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: