టీవీ : ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ కస్తూరి శంకర్..!

Divya
ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు ఇలా చర్మ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ అందరిని కలవరపరుస్తున్నారు. ఈ క్రమంలోని మొన్నటికి మన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయో సిటీస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పి అభిమానులను ఆందోళనకు గురిచేసింది.  ఈమె తన సమస్యను చెప్పిన వెంటనే ప్రముఖ నటి కల్పిక గణేష్ కూడా తనకు కూడా ఇలాంటి మయోసిటీస్ వ్యాధి వచ్చింది అని తెలిపి మరొకసారి షాకింగ్ కామెంట్లు చేసింది.
ఇకపోతే మరొక స్టార్ హీరోయిన్ మమత మోహన్ దాస్ కూడా రెండుసార్లు క్యాన్సర్ నుంచి పోరాడి బయటపడ్డ తర్వాత కూడా తనకు బొల్లి వ్యాధి వచ్చింది అని తెలిపింది. ఇంతమంది హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు ఇలా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ హీరోయిన్ కస్తూరి శంకర్ కూడా తాజాగా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. అసలు విషయంలోకెళితే తనకు చికెన్ ఫాక్స్ వచ్చిందని.. ఈ సమస్య కారణంగా చర్మంపై పొక్కులు దద్దుర్లు వచ్చినట్లు బుంగమూతి పెట్టి మరి ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
కస్తూరి శంకర్ తన ఇంస్టాగ్రామ్ లో.. నాకు చికెన్ ఫాక్స్ వచ్చింది ..ఇది ప్రాణహాని కలిగించే వ్యాధి.. ముఖ్యంగా చికెన్ ఫాక్స్ అనేది అంటూ వ్యాధి కాబట్టి నేను అందరికీ దూరంగా ఉంటున్నాను.. కానీ నా చర్మం ఇలాంటి దద్దుర్లు మచ్చలు రావడం నన్ను మరింత ఇబ్బందిగా మార్చింది నా ఈ జీవితంలో మచ్చలు లేని ముఖ సౌందర్యాన్ని నేను పొందాను .. కానీ ఇప్పుడు ఇలాంటి చర్మాన్ని కూడా అలవాటు పడాల్సి వస్తోంది అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే చికెన్ ఫాక్స్ రెండు వారాలు ఉంటున్న నేపద్యంలో రెండు వారాలపాటు కస్తూరి సీరియల్ కి బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: