జబర్దస్త్ వదిలిన కమెడియన్స్ పరిస్థితి ఇది.. గడ్డం నవీన్

Divya
ప్రస్తుతం బుల్లితెర ఇండస్ట్రీలో నంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా చాలామంది పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత కాలంలో జబర్దస్త్ కు దూరం అయ్యారు. కొంతమంది సహజంగా దూరమైతే మరికొంతమంది ఇతర ఛానల్స్ లో అవకాశాలు రావడమో ..లేదా సినిమాలలో అవకాశాలు రావడం వల్ల జబర్దస్త్ కు దూరం అయ్యారు.. ఇకపోతే షో కి పాపులారిటీ వచ్చిన తర్వాత దూరం అయినా.. వారి గురించి జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గడ్డం నవీన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు వెల్లడించడం ఇప్పుడు వైరల్ గా మారుతుంది..
జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి కొంతమంది కమెడియన్లు వెన్నుపోటు పొడవడం అంటే.. నేను కూడా అభి కి చిన్న సమస్యను సృష్టించాను అంటూ బాధపడ్డారు గడ్డం నవీన్.. నిజానికి అభికి ఒక మంచి అలవాటు ఉంది... ఎవరైనా కొత్త వారు అవకాశాలు ఇమ్మని అడిగితే వెంటనే వారికి అవకాశాలు ఇవ్వడమే కాదు.. వారికి ఉన్నత స్థాయి కల్పిస్తారు.. కానీ కొంతమంది తమ స్వార్థం కోసం అదిరే అభి కి వెన్నుపోటు పొడిచారు అంటూ ఆయన బాధపడ్డారు.. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది . అదిరే అభి వేరే కామెడీ షోకి రావాలని నన్ను పిలిచినప్పుడు నేను మాత్రం ఆయన మాట వినకుండా నన్ను నేను నమ్ముకుని ఆయన నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాను అంటూ గడ్డం నవీన్ వెల్లడించారు..
చెప్పాలి అంటే నా ఆర్థిక ఇబ్బందులే నన్ను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లకుండా చేశాయి.  కానీ అదే ఆయన విషయంలో ఎప్పుడు కూడా నాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది.. ఒకరకంగా చెప్పాలి అంటే జబర్దస్త్  వదిలిన తర్వాత వారి పరిస్థితి మరింత అద్వానంగా మారుతోంది.  ఆర్థికంగా ఎదగాలనుకున్న వారికి జబర్దస్త్ చాలా చక్కటి వేదిక.. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల అదిరే అభి జబర్దస్త్ షో కి దూరం అయ్యారు. నాగబాబు,  రోజా కూడా వెళ్లిపోవడం షో కి మైనస్ అయింది అంటూ గడ్డం నవీన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: