టీవీ: సుధీర్- రష్మీ లను విడదీసింది ఆమెనా..?

Divya
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. సుధీర్, రష్మి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని వార్తలు కూడా వినిపిస్తూ ఉండేవి. అలాగే వీరిద్దరూ షోలో చేసే హంగామా కూడా అంతా ఇంతా కాదు. నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకునేంతల చేస్తూ ఉంటారు. ఇక బుల్లితెరపై ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ కలిసి ఏ షో చేసినా కూడా చాలా కలర్ ఫుల్ గానే అభిమానులు బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు.
అయితే సుధీర్ జబర్దస్త్ వదిలేయడం జరిగింది.అయితే సుడిగాలి సుదీర్ మళ్ళీ  జబర్దస్త్ కు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడు వస్తారో మాత్రం చెప్పలేదు. రష్మీ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం బుల్లితెరపై మరొక హాట్ యాంకర్ ఎంట్రీ ఇస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మీ, సుధీర్ పాపులారిటీ సంపాదించుకుంటున్న సమయంలో సుధీర్ మరొక యాంకర్ తో రొమాన్స్ చేసి హాట్ టాపిక్ మారారు.

అంతేకాకుండా ఇప్పటికి సుధీర్ తో ఆమె రాసుకొని పూసుకానీ తిరుగుతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాంకర్ కి రష్మీ అంటే అసలు పడదని కూడా సమాచారం. అంతేకాకుండా ఈ యాంకర్ సుదీర్ జబర్దస్త్ నుంచి బయటకు తీసుకురావడానికి పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.. ఇలాంటివన్నీ ఫలించకపోగా ఎట్టకేలకు సుధీర్ జబర్దస్త్ నుంచి బయటికి రావడం జరిగింది. చివరికి ఆమె అనుకున్నది జరిగిందని సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సుధీర్, రష్మీ కలిసి మళ్ళీ ఉండాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. కానీ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఆ యాంకర్ ఎవరనే విషయం అభిమానుల సందేహాన్ని మిగిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: