టీవీ: జబర్దస్త్ రచ్చ రవి.. ఆరోగ్యం పై.. క్లారిటీ ఇదే.!!
ఇలా చాలామంది సీనియర్ నటులను సోషల్ మీడియా ద్వారా పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి మేము బతికే ఉన్నాము బాబోయ్ అని చెప్పేంత పరిస్థితి ఏర్పడేలా చేశారు. తాజాగా జబర్దస్త్ నటుడు రచ్చ రవికి ప్రమాదం జరిగిందని ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషయంగా ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ వార్తలు వైరల్ కావడంతో స్వయంగా రవిని క్లారిటీ ఇవ్వడం జరిగింది. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తను బాగానే ఉన్నట్లుగా తెలియజేశారు.
ఈ మధ్యనే పూణేలో షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్లి వచ్చానని కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పుడు క్షేమంగానే ఉన్నట్లనే తెలిపారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇలాంటి వదంతులు అసలు నమ్మవద్దని కూడా తెలియజేశారు రచ్చ రవి. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్మెంట్లో పాల్గొంటానని తెలిపారు. దీంతో రూమర్స్ చెక్ పడిందని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా పరిచయమైన రచ్చ రవి చమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లు చేశారు ఆ తర్వాత తాను స్వయంగా టీమ్ లీడర్ గా మారారు. ప్రస్తుతం రచ్చ రవి ఆరోగ్యం పైన ఈ వదంతులు ఫేక్ కావడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.