టీవీ: ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ మానేశా అంటూ ట్విస్ట్ ఇచ్చిన అనసూయ..!

Divya
బుల్లితెరపై హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతుంది ఈమె తెలుగు బుల్లి తెర యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, కోలీవుడ్ అంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు పట్టేస్తోంది. జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ గత ఏడాది షో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే సినిమాల వల్లే జబర్దస్త్ కి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను అని చెబుతూ తాను బయటకి వచ్చేసింది.
ముఖ్యంగా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాక కూడా అనసూయ చాలా విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు మొన్నామధ్య ఆంటీ వివాదం కూడా ముగిసింది.  ముఖ్యంగా తనను ఆంటీ అన్న వారిపై కేసు పెట్టి.. వాళ్లపై చర్యలు తీసుకుంటానని అనసూయ మరో ట్రిస్టు ఇచ్చింది.అయితే ఇప్పుడు మరొకసారి జబర్దస్త్ వదిలిపెట్టడానికి కారణం ఆ ఇద్దరే అంటూ షాక్ ఇచ్చింది. ఇకపోతే మొదటి నుంచి అనసూయ పై వల్గర్ గా జోకులు,  అడల్ట్ జోకులు ఎవరైనా వేశారు అంటే అది హైపర్ ఆది మాత్రమే ఆమె అలా చెప్పగానే ఆది,  రాంప్రసాదులు అని చెబుతుందేమో అని అందరూ షాక్ అయ్యారు.
కానీ ఆ ఇద్దరూ తల పిల్లలే అని చెప్పి షాక్ ఇచ్చింది. పిల్లలు పెద్దవారవుతున్నారు.  వారితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అందులోనూ రేపు వారు పెద్దయ్యాక ఈ షోలో నన్ను కించపరిచేలా మాట్లాడినా..వారి మనసులు నొచ్చుకుంటాయి.  అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసా అంటూ మరొక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇప్పుడు సినిమాలలో బిజీ అవడం వల్ల జబర్దస్త్ చేయడం కుదరలేదు అని కానీ తనకు ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ మంచి కెరియర్ అందించింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా అప్పట్లో సినిమాలు అని చెప్పి ఇప్పుడు ఆ నేరాన్ని పిల్లలపై నెట్టేసావా అంటూ ఆమెపై మళ్లీ నేటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: