టీవీ: శ్రీనివాస్ రెడ్డి విషయంలో పశ్చాత్తాప పడుతున్న రాకెట్ రాఘవ..!

Divya

ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమవుతున్న ఎంటర్టైన్మెంట్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల 500 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమం. ముఖ్యంగా ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది జడ్జెస్ మారిపోయారు.  యాంకర్లు మారిపోయారు.. కమెడియన్లు కూడా వెళ్లిపోయారు.. అయితే షో మాత్రం నిర్విరామంగా ముందుకు వెళుతూనే ఉంది.  అయితే ఆ ఈ షో ఆరంభం నుండి ఇప్పటివరకు వచ్చిన అన్ని ఎపిసోడ్లలో కనిపించిన ఏకైక కంటెస్టెంట్ రాకెట్ రాఘవ..

రాకెట్ రాఘవ తనదైన పంచ్ డైలాగులతో ఎప్పటికప్పుడు కుటుంబ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తూ వచ్చాడు.  అందుకే మొదటి నుంచి జబర్దస్త్ లోనే ఉంటున్నాడు కాబట్టి ఈయనను రోజా కూడా ఘనంగా సన్మానించింది. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే సమయంలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి విషయంలో తనకు తెలియకుండానే ఒక తప్పు జరిగిపోయిందని ఆ తప్పు వల్ల ఇప్పటికి బాధపడుతున్నాను అని పశ్చాతాపడుతున్నారు రాఘవ.
అసలు విషయంలోకి వెళితే.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో హైదరాబాదుకు వచ్చాను. కొత్తలో శ్రీరామ్ సీరియల్ లో నాకు ఎంతో సహాయం చేశాడు ఆయన సహాయాన్ని మర్చిపోలేను. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఎంతో ప్రోత్సహించేవారు.  ఆయనతో ఎన్నో షోలు , సినిమాలు కూడా చేశాను.  అయితే ఒకసారి ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే నవ్వుల సవాల్ కు శ్రీనివాస్ రెడ్డి యాంకర్ గా వ్యవహరించేవారు.. ఒకరోజు ఈ కార్యక్రమానికి చెందిన డైరెక్టర్ నన్ను పిలిచి ఈ షో నువ్వు చేస్తావా? అని అడగగానే వెనుక ముందు ఆలోచించకుండా ఎస్ చెప్పాను. ఒక ఎపిసోడ్ కూడా షూట్ అయిపోయింది.  అసలు ఈ విషయం తెలియని శ్రీనివాస్ రెడ్డి వచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయారు.  ప్రోగ్రాం చేయమని నిన్ను అడిగారా అని శ్రీనివాస్ రెడ్డి నన్ను అడిగారు.. అవునని చెప్పాను ..మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా అని అన్నారు.. అలా తనకు తెలియకుండానే శ్రీనివాసరెడ్డి విషయంలో తప్పు చేశానని తెలిపారు రాకెట్ రాఘవ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: