టీవీ: త్వరలో జబర్దస్త్ నుంచి ఆ కమెడియన్ దూరం కానున్నారా..!!
హైపర్ ఆది తన మంచితనంతో రైజింగ్ రాజుకు కూడా ఒక టీమ్ లీడర్ గా గుర్తింపుతో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాగానే ఇస్తూ ఉండేవారని అప్పుడప్పుడు రైజింగ్ రాజు కూడా తెలియజేస్తూ ఉండేవారు. ఇక ఆమధ్య హైపర్ ఆది జబర్దస్త్ కు దూరంగా ఉండడంతో రైజింగ్ రాజు కూడా సొంతంగా ఒక టీమ్ ను మెయింటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత హైపర్ ఆది వచ్చిన తర్వాత మళ్ళీ హైపర్ ఆది రైజింగ్ టీమ్గా మారిపోయింది.
కానీ హైపర్ ఆది రియంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మళ్లీ దూరం అయ్యారు. ఈసారి పర్మినెంట్గా హైపర్ ఆది దూరం కావడంతో రైజింగ్ రాజు టీమ్ కు ప్రాముఖ్యత లేకపోతోంది. అసలు రైజింగ్ రాజు అనే వాడు లేకుండా పోయారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడో ఒక మూల చిన్నచిన్న గెటప్పులలో కనిపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రైజింగ్ రాజు అసలు జబర్దస్త్ స్టేజి పైన కనిపించడం అసాధ్యం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆదితో కలిసి చేసేటువంటి స్కిట్ల వల్ల రైజింగ్ రాజుకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు అందుకు పూర్తిగా మారిపోయిందని సమాచారం.