టీవీ: పెళ్లి రూమర్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన శ్రీముఖి..!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. ఈ క్రేజ్ తోనే ఏమి బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించింది. ఇలా బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులాంటి అందుకోవడంతో ఈమెకు పలు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. దీంతో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది శ్రీముఖి. ఇక అప్పుడప్పుడు పలు ఈవెంట్లకు పలు అవార్డు ఫంక్షన్లకు కూడా హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఎప్పుడు కూడా శ్రీముఖి వివాహం పైన పలు వార్తలు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి.

తాజాగా గడిచిన కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్ గా మారడంతో ఈ వార్తల పైన మరొకసారి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది శ్రీముఖి. ముఖ్యంగా తనకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా సరే అభిమానులతో పంచుకుంటూ ఖుషి అవుతూ ఉంటుంది. ఈ సందర్భంగా తన పెళ్లి అప్పుడే అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక వ్యాపారవేత్తతో ఇమే వివాహం జరగబోతోందని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో తాజాగా ఈ రూమర్ల పైన స్పందిస్తూ..

ఒకసారి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ మరొకసారి పెళ్లి ఎప్పుడు అంటూ కొన్నిసార్లు తన తండ్రి ఫోటోలని బ్లర్ చేసి పెళ్లి రూమర్లను పుట్టించడం చాలా దారుణమని ఫైర్ అవుతోంది శ్రీముఖి. ఈ వార్తలు విని విని తనకు చాలా విసుగు వస్తోందని అని తెలియజేసినట్లు సమాచారం. తన పెళ్లి మాత్రం ఇంకా నాలుగేళ్లు సమయం పడుతుందని అప్పుడే తానే స్వయంగా ప్రకటిస్తానంటూ క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది శ్రీముఖి. దీంతో ఈమె పైన రూమర్లకు చెక్ పడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: