టీవీ: బుల్లితెర పై శ్రద్ధాదాస్ సినిమాల కంటే ఎక్కువ సంపాదిస్తోందా..?

Divya
ప్రముఖ అందాల తార శ్రద్దాదాస్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి ముఖ్యంగా ఆర్య 2 చిత్రం ద్వారా ప్రేక్షకులను తన వశం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో నటించకుండా బుల్లితెరకే తన జీవితాన్ని అంకితం చేసింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. గతంలో ప్రియమణి , ఆనీ మాస్టర్, పూర్ణ లు జడ్జిగా వచ్చారు. పూర్ణ తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె పూర్తిగా దూరమైంది. ప్రియమణి కూడా పారితోషకం విషయంలో ఎక్కువ డిమాండ్ చేస్తుంది అన్న నేపథ్యంలో మల్లెమాలవారు ఆమెను పక్కకు పెట్టారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆని మాస్టారు కూడా షోకి పూర్తిగా దూరమయ్యారు.  సినిమాలు ఇతర కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు.  అందుకే ఈ షో కి ఆమె హాజరు కాలేకపోతుండడం గమనార్హం. ఇకపోతే ఇప్పుడు ఈ డాన్స్ షోలో శ్రద్దా దాస్ ను రంగంలోకి దించారు మల్లెమాల. డాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో పాటు వచ్చిరాని తెలుగులో ఆమె బాగానే మాట్లాడుతూ అందర్నీ అలరిస్తోంది .ముఖ్యంగా సినిమాల్లో కంటే  ఇక్కడే ఎక్కువగా సంపాదిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి సినిమాల్లో బిజీగా లేని శ్రద్దా దాస్ కి కచ్చితంగా ఢీ డాన్స్ షో ఆమె కెరియర్ కు కీలకమవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
అంతేకాదు పారితోషకం విషయంలో పట్టింపు లేకుండా ఈ షో చేస్తుందని సమాచారం కూడా అందుతుంది.  కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో షెడ్యూల్ కోసం దాదాపు లక్ష రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక షెడ్యూల్లో రెండు లేదా మూడు ఎపిసోడ్స్ మాత్రమే షూట్ చేస్తారు.  కాబట్టి ఆమెకు డీసెంట్ రేమ్యూనరేషన్ దక్కుతున్నట్లుగా భావించవచ్చు.  మొత్తానికైతే సినిమాల్లో కంటే ఇక్కడ ఈమెకు బాగా పారితోషకం లభిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ క్రేజ్ సంపాదించుకొని ఆమె మళ్ళీ సినిమాల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: