టీవీ: చిన్నారి పెళ్లికూతురు గురించి తెలియని సీక్రెట్స్ చెప్పిన నాగార్జున..!!

Divya
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి ఆవికా గోర్.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత వరుసగా సక్సెస్ లు అందుకుంటు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆవికాకు ప్రస్తుతం హీరోయిన్గా బిజీగా ఉన్నది. అయితే తాను నటించిన తాజా చిత్రం పాప్ కార్న్.. సాయిరోకన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురళీ గంధం దర్శకత్వం వహించారు.
ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేస్తూ చిత్ర బృందానికి అభినందనలు కూడా తెలియజేశారు. ట్రైలర్ బాగుందని తెలియజేయడమే కాకుండా ఆవికా గోర్ గురించి అతి పెద్ద సీక్రెట్ ను కూడా తెలియజేశారు. నాగార్జున మాట్లాడుతూ పదేళ్ల క్రితం తాను బ్రెజిల్ లో రియో నగరానికి వెళ్లారట. అక్కడ ఒక స్టూడియో చూద్దామని వెళ్ళగా అందులో ఆవికాగోర్  ఫోటో కనిపించిందన్నారు. ఆ కథ చెబుతూ చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ని వాళ్ళు కూడా డబ్ చేసి విడుదల చేశారట. అది కూడా పెద్ద హిట్ అయిందని చెప్పారని తెలిపారు.
ఇప్పటికీ మీ వద్ద బాల్యవివాహాలు జరుగుతుంటాయయా అని పలు రకరకాల ప్రశ్నలు వేస్తూ తమపై ఆసక్తి చూపారని తెలిపారు. అంతేకాకుండా ఆ సీరియల్ 128 దేశాలలో డబ్ అయ్యిందని తెలియజేశారు. ఇప్పుడు మనం అంతా పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం కానీ ఆవికాగోర్ పదేళ్ల క్రితమే పాన్ వరల్డ్ స్టార్ అని తెలియజేశారు. కజకిస్తాన్ లో రెండు సినిమాలు చేసిందని అవి మామూలు విషయం కాదని తాను మాటీవీ ఓనర్ గా ఉన్నప్పుడు ఆవికా తనకు పరిచయం అయ్యిందని తెలిపారు. ఆ తర్వాతే ఆమెతో ఉయ్యాల జంపాల చేశామని.. ఆ సినిమా తర్వాత తెలుగు పెళ్లికూతురు అయ్యిందని తెలిపారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: