టీవీ: కిరాక్ ఆర్పీ రెస్టారెంట్ మూసేయడానికి కారణం అదేనా..?

Divya
జబర్దస్త్ లో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ షో గురించి , నిర్వాహకుల గురించి ఈయన చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. ఇతర కామెడీ షోలలో కూడా ఈయనకు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సారంగపాణి అనే వెబ్ సిరీస్ లో మాత్రమే నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా కిరాక్ ఆర్ పి ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ ఈ రెస్టారెంట్ కు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేయడంతో ఈ రెస్టారెంట్ ఆయన పాలిట వరమయింది. తక్కువ స్థలంలో రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం..  కష్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ రెస్టారెంట్ నిర్వహణ విషయంలో ఆర్పి ఎన్నో ఇబ్బందులు పడ్డారు . అయితే ఈ రెస్టారెంట్ ప్రస్తుతం తాత్కాలికంగా క్లోజ్ అయిందని వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మరిన్ని మార్పులతో త్వరలో రెస్టారెంట్ ని మళ్ళీ ఓపెన్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కిచెన్ యొక్క సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు షాప్ కు కీలక మార్పులు చేసి మళ్ళీ రెస్టారెంట్ ఓపెన్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జనాల తాకిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వర్కర్లు,  వంట మాస్టర్లను పెంచాల్సిన అవసరం ఉందని ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొద్ది రోజులు తాత్కాలికంగా రెస్టారెంట్ ను ఆపాము అని ఆయన తెలిపారు . నెల్లూరు మహిళలతో చేపల పులుసు వండించాలని ప్లాన్ చేశామని కూడా ఆయన పేర్కొన్నారు.ఆడిషన్స్ పెట్టి చేపల పులుసు టేస్ట్ చేసి ఎంపిక చేస్తామని కూడా తెలిపారు ఆర్పి. ఎవరికైనా హైదరాబాదుకు వచ్చే ఆలోచన ఉంటే వాళ్లకు కూడా అవకాశం కల్పిస్తామని ఆయన కామెంట్లు చేశారు. మరి ఏ స్థాయిలో జనాలు వస్తారో ముందే అంచనా వేయకపోవడం వల్లే ఇప్పుడు రెస్టారెంట్ తాత్కాలికంగా క్లోజ్ అయిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: