టీవీ: బాలయ్య షో కి పోటీ ఇవ్వబోతున్న సుమ.. నెగ్గుతుందా..?

Divya
ప్రముఖ టాలీవుడ్ హీరో బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండగానే మరొకవైపు బుల్లితెర షోలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన హోస్ట్ గా చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రాజకీయ నాయకులు, ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరై మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. సీజన్ వన్ దిగ్విజయంగా పూర్తి అవడంతో సీజన్ 2 కూడా మొదలుపెట్టేశారు. మరో నెల రోజుల్లో సీజన్ 2 కూడా పూర్తీ కాబోతోంది.
ఇలాంటి సమయంలోనే బాలయ్య షో తరహాలో బుల్లితెర క్వీన్  గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కూడా టాక్ షో ఒకటి నిర్వహించడానికి సిద్ధమవుతుందట.  అంతేకాదు ఆ టాక్ షో ద్వారా బాలయ్య అన్ స్టాపబుల్ షో కి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్యాష్ వంటి ప్రోగ్రామ్ లు  చేస్తూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలతో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇదే షో ని కొనసాగిస్తుందా?  లేక ఈ షో స్థానంలో మరొక షోని తీసుకొస్తుందా  అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే సుమ గత కొద్దిరోజులుగా బుల్లితెరకు దూరమవుతోంది అంటూ వార్తలు వైరలైన విషయం తెలిసిందే . కానీ ఈమె ఈ విషయంపై స్పందిస్తూ తనకు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెర రంగాన్ని ఎప్పటికీ మరిచిపోనని .. తాను ఉన్నంతకాలం యాంకర్ గా కొనసాగుతానని కూడా తెలిపింది. మొత్తానికైతే సుమ తన షో తో ఇప్పుడు బాలయ్య షో ని ఢీ కొట్టబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పుడిప్పుడే కొత్త యాంకర్లు వస్తున్న నేపథ్యంలో సుమా హవా కూడా తగ్గుతోంది.  ఇలాంటి సమయంలో బాలయ్య లాంటి క్రేజీ స్టార్ హీరోలనే దెబ్బ కొట్టే విధంగా ఈమె సరికొత్త టాక్  షో తో రాబోతోంది.  మరి ఈ షో ద్వారా ఊహించినట్టుగానే క్రేజ్ పొందుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: