టీవీ: జబర్దస్త్ కమెడియన్ పై వస్తున్న వార్తలు నిజమేనా..?

Divya
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కీలకంగా కమెడియన్లు వ్యవహరిస్తున్న వారిలో నూకరాజు కూడా ఒకరు. అతి త్వరలోనే మల్లెమాల వారికి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్ లో ఇన్నాళ్లుగా చేస్తున్నప్పటికీ టీం లీడర్ పదవి ఇవ్వకపోవడంతో నూకరాజు చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే నూకరాజు ఇతర చానల్స్ కి వెళ్ళిపోతారు అన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈటీవీలో నూకరాజుకు ప్రాముఖ్యత బాగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జబర్దస్త్ కొత్త టీమ్ లీడర్స్ వచ్చిన ఈ సమయంలో తనకు ఒక టీమ్ ఇవ్వాల్సింది అంటూ నూకరాజు కోరుకున్నారట. కానీ తనకి టీమ్ లీడర్ ఇచ్చేందుకు మల్లెమాలవారు ఒప్పుకోలేదని సమాచారం. అందుచేత నూకరాజు ప్రస్తుతం ఇతర ఛానల్ కు వెళ్లి ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ మా లో కామెడీ స్టార్స్ కోసం గతంలో వెళ్లిన కమెడియన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందరూ చూస్తూనే ఉన్నారు.
అందుకోసమే నూకరాజు ఇన్ని రోజులు వెయిట్ చేశారని ఇక వెయిట్ చేయాలనుకోవడం లేదని ఆయన సన్నిధిలో వర్గాల నుంచి సమాచారం ఎప్పుడు ఆహా ఓటీటి లో నూకరాజు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతమంది కమెడియన్ తరహాలో నూకరాజు మల్లెమాల వారితో అగ్రిమెంట్ చేయలేదట..ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆ ఛానల్ నుంచి బయటికి వచ్చి ఇతర ఛానల్ కు వెళ్ళవచ్చన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై అసలు క్లారిటీ రావాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈటీవీ మల్లెమాలవారు యొక్క ప్రవర్తన కారణంగా జబర్దస్త్ నుంచి ఇప్పటికీ కొంతమంది కమెడియన్లు సైతం వెళ్లిపోవడం జరిగింది. నూకరాజు మీద వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: