శ్రీహన్ సిరిల మధ్య అంత జరిగిందా.. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడిందా ?

VAMSI
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో 14 వ వారం జరుగుతోంది. ఇంకో వారంలో బిగ్ బాస్ ముగిసిపోయి విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇంట్లో ఇపుడు రేవంత్, రోహిత్, శ్రీహన్, ఆదిరెడ్డి , శ్రీ సత్య , కీర్తి మరియు ఇనాయాలు ఉన్నారు. ఈ వారం టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కారణంగా శ్రీహన్ మాత్రమే నామినేషన్స్ లో లేడు, మిగిలిన అయిదు మంది సభ్యులు నామినేషన్ లోనే ఉన్నారు. కాగా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళుతారు అని భావిస్తున్న వారిలో కీర్తి, ఆదిరెడ్డి లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీహన్ ప్రియురాలు సిరి హన్మంతు తమ బంధం గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఈమె కూడా గత సీజన్ లో ఒక సభ్యురాలుగా వెళ్లి టాప్ 5 వరకు చేరుకున్న విషయం తెలిసిందే.
అప్పట్లో షణ్ముఖ్ జస్వంత్ కు సిరి కి మధ్యన ఏదో ఉందన్న వార్తలు శ్రీహన్ సిరిల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ఇటీవల అరియానాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సిరి గతంలో వారిద్దరి బంధంపై వచ్చిన కొన్ని ఆర్టీకల్స్ ను చూపించి క్లారిటీ అడిగింది. ఇందుకు ఆమె అవన్నీ ఒక కష్ట సమయంలో జరిగి ఉండవచ్చు. మేము ఇద్దరం ఒక మంచి అండర్స్టాండింగ్ తోనే ముందుకు వెళుతున్నామని, మధ్యలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే అని , అంత మాత్రాన బంధాలకు దూరంగా ఉండే అంత బలహీనమైన రిలేషన్ మాది కాదు అంటూ స్ట్రాంగ్ గా చెప్పింది.
ఆ క్లిష్ట సమయంలో మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చాయని.. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు చెప్పింది. అయితే అలంటి ఎన్నో అవాంతరాలను దాటుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాము అంటూ సిరి శ్రీహన్ ల బంధం గురించి చెప్పింది. ఇప్పుడు సిరి శ్రీహన్ ను ఎలాగైనా విజేతగా చెయ్యాలని బయట ఎంతగానో శ్రమిస్తోంది. తనకు దక్కని బిగ్ బాస్ టైటిల్ ను శ్రీహన్ అయినా గెలవాలని కోరుకుంటోంది. మరి టాప్ కు చేరుకున్న మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన శ్రీహన్ విన్నర్ గా నిలుస్తాడా అన్నది తెలియాలంటే మరొక్క వారం రోజులు ఆగాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: